యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'రంగ్ దే' మూవీ సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నితిన్, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతోంది. 'తొలిప్రేమ','మజ్ను' వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన యువ దర్శకుడు 'వెంకీ అట్లూరి' ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2021 సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నారు.