ఇందులో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. బసవతారకంగా బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటిస్తుండగా, చంద్రబాబు నాయుడిగా రానా, ఏఎన్నార్‌గా సుమంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 'మహానటి' సావిత్రి పాత్రలో నిత్యా మీనన్ నటించనున్నారట. ఎన్టీఆర్, సావిత్రి కలిసి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించారు. అందులో 'మిస్సమ్మ', 'మాయాబజార్', 'రక్త సంబంధం' చిత్రాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు.