కెరీర్ బాగున్నప్పుడు వరసు సినిమాలు తీసి.. పేరు తెచ్చుకున్న వివి.వినాయక్.. ఇప్పుడు వెనుకడగువేశాడు. 'అఖిల్' ఇచ్చిన డిజాస్టర్‌తో డీలాపడటంతో చిరంజీవి పిలిచిమరీ 'ఖైదీ నెంబర్ 150' ఇచ్చాడు. అయితే అది రీమేక్ కావడం.. చిరంజీవి ఎలా చేస్తాడనే క్రేజ్ తప్ప.. దర్శకుడిగా వినాయక్ చేసిందేమీలేదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందుకే ఆయన తదుపరి చిత్రం ఏమిటనేది ప్రశ్నార్థకంగామారింది.
కొంత గ్యాప్ తీసుకున్ని చేస్తానని చెబుతున్నా.. అందుకు పరిస్థితులు అనుకూలించడంలేదు. తన వద్ద ఉన్న కథలు వినడానికి పెద్దగా ఎవ్వరూ ముందుకు రాకపోవడం విశేషం. కాగా, వినాయక్ సినిమా చేయాల్సివస్తే.. చిరు కాంపౌడ్ హీరోలతోనే చేయాల్సివుంటుంది. వేరే హీరోలు డేట్స్ కుదకపోవడంతో వినాయక్ డైల్‌మాలో పడినట్లు వార్తలు విన్పిస్తున్నాయి.