చిరంజీవినే కాదు సినిమా వాల్ళ‌ను విమర్శించే హక్కు ఎవరికీ లేదుః కాశీ విశ్వనాథ్‌

సోమవారం, 31 మే 2021 (19:01 IST)
Kasi viswanadh
వాక్ వాక్ స్వాతంత్రం ఇచ్చింది. ప్రభుత్వ తప్పిదాలని, పార్టీ సిద్దాంతాలని వ్యవస్థ లోపాలని విమర్శించడానికి గానీ వ్యక్తిగత దూషణల కోసం కాదని గుర్తెర‌గాల‌ని ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు  కాశీ విశ్వ‌నాథ్ తెలియ‌జేస్తున్నారు. ఇటీవల క‌రోనా స‌మ‌యంలో కోవిడ్ పేషంట్ల‌కు ఆ సాయం, ఈ సాయం చేయ‌డంలేద‌ని చిరంజీవితోస‌హా ప‌లువురిని ప‌లువురు దూషించ‌డం ప‌ట్ల ఆయ‌న సోమ‌వారంనాడు  తీవ్రంగా స్పందించారు.
 
చిరంజీవి గారు అందరి హీరోలను, నిర్మాతలను దర్శకులనూ కో-ఆర్డినేట్ చేసి సి.సి.సి. (కరోనా క్రైసిస్కమిటీని) ఏర్పాటు చేసి ఆకలితోనూ అవసరం లోనూ వున్న 24 Crafts లోని సినీ కార్మికులకు.. గ్రోసరీస్, మందులు, వ్యాక్సిన్ లు సరఫరా చేసి అందరినీ ఆదుకుని మహోన్నత వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అంతే కాదు ఆర్ధికంగా ఇబ్బందులో వున్న కళాకారులెందరికో ఆయన ఎవరికీ తెలియని. ఎన్నెన్నో 'సాయాలు' చేశారు."దర్శకుల  సంఘం" ఏర్పాటు చేసిన  TRUST కి. అప్పటికప్పుడు స్పందించి.. 25,00,000 ల రుపాయల విరాళాన్ని ప్రకటించిన  విశాల హృదయం  ఆయనిది.
 
ఇంకా ఎన్నో విస్తృత సేవలు.చేయడానికి.రామ్ చరణ్ గారు, ఉపాసనా గారు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు.ఇలాంటి గొప్ప వ్యక్తిని social మీడియాలో ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు  ' Trolls, చేస్తే.. Facebook లో postలు.. డుతుంటే.. పిచ్చి పిచ్చిగా కామెంట్స్ పెడుతుంటే చూసి బాధతో ఆయన గురించి తెలిసిన వ్యక్తిగా తట్టుకోలేక నేను ఇలా స్పందిస్తున్నాను అని తెలిపారు. ఇలా ఎంతోమంది ప్ర‌ముఖులు శ‌క్తిమేర‌కు సాయం చేస్తున్నారు. 
 
ఇక సోనూసూద్ గారు  ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందరో ఆయన్ని కొనియాడుతున్నారు. ఆయన ప్రమేయం లేకుండానే ఆయన చేసే మంచి పనులకు మంచి పబ్లిసిటీ ఇస్తున్నారు. ఆయన లాగే హిందీ పీల్డ్ లో అమితాబ్ బచన్ గారు అక్షయ్ కుమార్ గారు లాంటి హీరోలు కూడా ఎందరో 'సాయం'  చేస్తున్నారు.
మీ Trolls వల్ల ఇండస్ట్రీ లో అందరితో కలిసి పోయి.అందరిలో కలివిడిగా సింపుల్ సిటీని ఇష్టపడే సోనూసూద్ గారికి కూడా.ఇబ్బంది పడే  'పరిస్తితి' ఎందుకు కలిగిస్తారు? వాక్ స్వాతంత్ర్యం ఇచ్చినది.. ప్రభుత్వ తప్పిదాలని, పార్టీ సిద్దాంతాలని.. వ్యవస్థ లోపాలని.. విమర్శించడానికి గానీ.. ఇలా వ్యక్తిగత దూషణల కోసం కాదని నెగెటివ్ మైండ్ వున్న వారు గుర్తెరిగితే మంచిదని ధ్వ‌జ‌మెత్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు