'బాహుబలి-2' సినిమాలో కట్టప్ప పాత్ర ఎంతో కీలకమో సినిమా చూసిన వారందరికీ తెలుసు. ఈ పాత్రకు తమిళ నటుడు సత్యరాజ్ పూర్తి న్యాయం చేశాడు. ఈ పాత్రకు సత్యరాజ్ మినహా ప్రేక్షకులు ఎవ్వరిని ఊహించుకోలేకపోయారు. అలాంటి ఈ పాత్రకు ముందుగా సత్యరాజ్‌ను అనుకోలేదట. కట్టప్పగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ను ముందుగా సంప్రదించారట.