నువ్వా నేనా అన్నట్లుగా ఎన్టీఆర్ బయోపిక్ డిజైన్ - వైఎస్సార్ బయోపిక్ యాత్ర టీజర్ లుక్(Video)

శుక్రవారం, 6 జులై 2018 (10:27 IST)
ఈ రోజు శుక్రవారం జూలై 6న ఎన్టీఆర్ బయోపిక్ డిజైన్ ఒకవైపు వైఎస్సార్ బయోపిక్ యాత్ర టీజర్ లుక్ ఇంకోవైపు విడుదలయ్యాయి. ఈ రెండు లుక్స్ అటు నందమూరి ఫ్యాన్సుకి ఇటు వైఎస్సార్ అభిమానులను ఉర్రూతలూగించేలా వున్నాయి. 
 
ఇంతకీ ఎన్టీఆర్ బయోపిక్ డిజైన్లో ఏమున్నదంటే... అభిమానమును మించిన ధనము, ఆదరమును మించిన పెన్నిధి ఈ లోకమునే లేదు. ఇందరి సోదరుల ప్రేమానురాగాలను పంచుకోగలగుట ఈ జన్మకు నేను పొందిన వరం. మీకు సదా రుణపడ్డట్టే. శుభాకాంక్షలు.. సోదరుడు రామారావు, ఆగస్టు 27, 1975 అని ఎన్టీఆర్ సంతకం చేసిన డైరీ కనబడుతోంది. దాని క్రింద తెలుగువారందరి ఆశీస్సులు కోరుతూ నందమూరి బాలకృష్ణ, క్రిష్ జాగర్లమూడి పేర్లు వున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య, ఎన్టీఆర్ సతీమణి పాత్రలో విద్యా బాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
 
ఇక వైఎస్సార్ బయోపిక్ టీజర్ లుక్ విషయానికి వస్తే... కడప దాటి ప్రతీ గడపలోకి వస్తున్నాను. మీతో కలిసి నడవాలనుంది. మీ గుండె చప్పుడు వినాలని వుంది అంటూ క్యాప్షన్ ఆ క్రిందనే మమ్ముట్టి పంచెకట్టు లుక్ కనబడుతోంది. ఈ టీజర్ జూలై 8న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడిస్తోంది. ఇకపోతే వైఎస్సార్ బయోపిక్ యాత్రలో వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా వైఎస్సార్ సతీమణి విజయమ్మ పాత్రలో  ఆశ్రిత వేముగంటి(‘బాహుబలి’ ఫేం) నటిస్తున్నారు. వీడియో చూడండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు