మోహన్ లాల్ ఒడియన్ ట్రైలర్ (వీడియో)

శనివారం, 8 డిశెంబరు 2018 (19:10 IST)
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, మంజు వారియర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఒడియన్ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో మోహన్ లాల్ లుక్ అదిరింది. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం హించిన ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 14వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు వెర్షన్ నుంచి టీజర్ రిలైంది. 
 
ఒడియన్ చీకటి రాజ్యానికి రారాజు అని, నువ్వు చూడని రూపం ఒకటుంది.. అంటూ మోహన్ లాల్ చేసే డైలాగ్ మరింత ఆసక్తి రేకెత్తింటేలా వున్నాయి. కేరళలోని మలబార్ ప్రాంతానికి చెందిన ఒడియన్లు విద్యుత్ యుగానికి ముందు నివసించే వారు. కాగా మోహన్ లాల్ అలాంటి విభిన్న కథను ఎంచుకుని ఒడియన్‌గా వస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్‌ను ఓ లుక్కేయండి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు