ఓం నమో వేంకటేశాయ సినిమా ట్రైలర్.. సౌరభ్, నాగార్జున, అనుష్క భలే అనిపించారు.. (Video)

శనివారం, 24 డిశెంబరు 2016 (13:22 IST)
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఓం నమో వేంకటేశాయ' సినిమా టీజర్ రిలీజైంది. 'అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా... ఆనంద నిలయ వరపరిపాలక..' అంటూ సాగే ఈ టీజర్‌ను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది.

'అన్నమయ్య', 'శ్రీ రామదాసు', 'శిరిడిసాయి' చిత్రాల తర్వాత రాఘవేంద్రరావు, నాగార్జున, ఎం.ఎం. కీరవాణి కాంబినేషన్‌లో వస్తున్న భక్తిరస సినిమాలో అనుష్క, ప్రగ్యా జైశ్వాల్‌, సౌరభ్‌, జగపతిబాబు, విమలా రామన్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
 
సాయి కృప ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున శ్రీవారి భక్తుడిగా నటించారు. అనుష్క ఈ చిత్రంలో గోదాదేవిగానూ శక్తి మాతగానూ వివిధ షేడ్స్‌లో కనిపిస్తూ ప్రేక్షకులకు బిగ్ ట్రీట్ ఇవ్వనుంది. ట్రైలర్ మీ కోసం..
 

వెబ్దునియా పై చదవండి