టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓకే అంటే ఆయనతో ప్రేమాయణానికి రెడీ అని బాలీవుడ్ స్టార్ రాఖీ సావంత్ ప్రకటించిన నేపథ్యంలో.. తాజాగా కోహ్లీని అభిమానించే సెలెబ్రిటీల్లో మరో బాలీవుడ్ బ్యూటీ కుడా చేరిపోయింది. ఆ భామే ప్రాచీ దేశాయ్. విరాట్ కోహ్లీపై మనసు పారేసుకున్నానని.. కోహ్లీతో డేటింగ్ వెళ్లాలనుందని చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రాచీ దేశాయ్ కామెంట్సే బిటౌన్‌లో చర్చనీయాంశమైంది.