టాలీవుడ్‌లో మధురిమగా పరిచయమైన హీరోయిన్ ప్రస్తుతం నైరా బెనర్జీగా పేరు మార్చుకుంది. ఆ ఒక్కడు సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ భామ ఆరెంజ్, షాడో, కొత్త జంట, టెంపర్, దోచేయ్ వంటి చిత్రాల్లో నటించింది. అయితే అందం ఉన్నా హీరోయిన్‌గా మంచి గుర్తింపు సాధించలేకపోవడంతో నైరా బెనర్జీగా పేరు మార్చుకుంది. అంతే అమ్మడుకు ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్ వచ్చింది.
వాస్తవానికి ఈ సినిమాలో ఇంటిమేట్ సీన్లలో నటించడానికి నైరా బెనర్జీ చాలా ఇబ్బంది పడిందట. ముఖ్యంగా బెడ్ రూం సీన్లలో రొమాన్స్ చేయడానికి నైరా మొహమాటపడిందట. అయితే అలాంటి సీన్లలో మందు కొట్టేస్తే, ఎలాంటి ఇబ్బంది ఉండదని యూనిట్ చెప్పడంతో చిత్తుగా తాగేసి, రొమాన్స్ పండించిందట. ఈ విషయాన్ని నైరానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పేసింది.