అనంతరం త్రినాత్ మాట్లాడుతూ, నరేన్ మంచి స్నేహితుడు. నాన్నకు ప్రేమతో కాదు కొడుకుకి ప్రేమతో అని చెప్పాలి. ఆస్ట్రేలియా వెళ్లి వచ్చాక నరేన్‌కు జాబ్ రాలేదు మళ్ళీ వెళ్ళిపోదాం అనుకున్నాడు, అప్పుడు నేను చెప్పాను తల్లి తండ్రులకి తోడుగా ఉండరా అని చెప్పాను అప్పుడు అలోచించి సినిమా తియ్యాలి అని ఫిక్స్ అయ్యాడు, అదే ఊరికి ఉత్తరాన. ఇందులో ఏముందునేది తెరపై చూడాల్సిందే అన్నారు.
హీరో నరేన్ మాట్లాడుతూ, సురేష్, పూర్ణ మంచి పాటలు రాశారు, డైరెక్టర్ బాగా తీశారు సినిమాని, ఉదయ్, మని, డైరెక్టర్, నేను ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాం, రీల్ ఫాదర్ అయిన చక్ర పాణి గారు నన్ను చాలా బాగా గైడ్ చేశారు, ఏదైనా నేను బాగా చేయకపోతే ఆయనే చేసి చూపించాడు, మా హీరోయిన్ దీపాలి శర్మ ప్రతి ఎమోషన్స్ పండించింది. మా నాన్న మై హీరో. ఎక్కడో వరంగల్ దగ్గర చిన్న గ్రామంలో వ్యవసాయం చేస్తూ సినిమా అంటే తెలియదు, ఆస్ట్రేలియా అంటే తెలియదు, అలాంటి వ్యక్తి ఎక్కడ పడితే అక్కడ అప్పులు తీసుకొచ్చి నన్ను ఈ స్థాయి కి తీసుకువచ్చారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తరువాత నాకు ఇక్కడ జాబ్ లేకపోయినప్పుడు మా నాన్న తో సినిమా తీద్దాం అన్నాను.అలా మంచి ఫీల్‌గుడ్ సినిమాను తీశామని అన్నారు.