తాజాగా మేకర్స్ టీజర్ ని విడుదల చేశారు. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్.. ఇలా సినిమాలోని ప్రధాన పాత్రలని పరిచయం చేస్తూ ప్రారంభమైన టీజర్ చాలా ఆసక్తికరంగా వుంది. యాక్షన్, డ్రామా, ఫన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ తో టీజర్ ప్రేక్షకులని అలరించింది. టీజర్ చివర్లో వైవా హర్ష చెప్పిన డైలాగ్ నవ్వులు పూయించింది. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్ పాత్రల ప్రజెన్స్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. సునీల్ చేతిపై జై చిరంజీవా అనే టాటూ ప్రత్యేకంగా ఆకర్షించింది.
దర్శకుడు సంతోష్ కంభంపాటి హిలేరియస్ క్రైమ్ కామెడీని ప్రేక్షకులకు అందించబోతున్నారని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. టీజర్ కి కంపోజర్ రీ అందించిన నేపధ్య సంగీతం చాలా గ్రిపింగ్ గా వుంది. బాల సరస్వతి కెమరామెన్ పనితనం బ్రిలియంట్ గా వుంది. విజువల్స్, నిర్మాణ విలవలు ఉన్నతంగా వున్నాయి.