పరుచూరి వెంకటేశ్వర రావుకు సతీవియోగం

శుక్రవారం, 7 ఆగస్టు 2020 (11:23 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కథ, మాటల రచయిత పరుచూరి వెంకటేశ్వర రావుకు సతీవియోగం కలిగింది. ఆయన భార్య విజయలక్ష్మి శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమెకు వయసు 74 యేళ్లు. గుండెపోటుతో ఆమె మరణించినట్టు కుటుంబీకులు తెలిపారు. 
 
విజయలక్ష్మి మృతి విషయాన్ని తెలుసుకున్న పలువురు తెలుగు సినీ ప్రముఖులు పరుచూరి వెంకటేశ్వరరావుకు సంతాపాన్ని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఇంటికి చేరుకున్న పరుచూరి గోపాలకృష్ణ, సోదరుని ఓదార్చే ప్రయత్నం చేశారు. 
 
అలాగే, విజయలక్ష్మి మరణవార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి పరుచూరి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి పరామర్శించారు. తన ప్రగాఢ సానభూతిని తెలిపారు. పరుచూరి వెంకటేశ్వరరావు తనకు ఎంతో ఆత్మీయుడని, ఆ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. విజయలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని చిరంజీవి అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు