అమెరికాలో ఆ రికార్డును కాటమరాయుడు బ్రేక్ చేస్తుందా లేదా?

శుక్రవారం, 24 మార్చి 2017 (08:32 IST)
అమెరికాలో పవన్ కల్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు విడుదలకు సిద్ధమైంది. చిత్రానికి సంబంధించిన అన్ని డ్రైవ్‌లు సకాలంలో చేరుకున్నాయి. కాబట్టి ప్రీమియర్ షోల విషయంలో ఇక ఆలస్యం జరగదు. ఇప్పుడు అసలు చర్చ ఏంటి అంటే కాటమరాయుడు కలెక్షన్స్ టార్గెట్ ఎంత అనేదే. అమెరికాకు సంబంధించినంతవరకు పవన్ టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్లలో ఒకరుగా ఉన్నారనండంలో సందేహమే లేదు. కాబట్టి కాటమరాయుడు వసూళ్లు ఎంత? కాటమరాయుడు ప్రీమియర్ షోల విషయంలో కూడా రికార్డు సృష్టించనుందని బోగట్టా. కాటమరాయుడు సినిమా పవన్ స్టార్‌డమ్‌కు పరీక్షగా నిలబడుతోంది. 
 
రాయలసీమ రైతు పునాదిగా తయారైన కాటమరాయుడు కలెక్షన్స్ టార్కెట్ సర్దార్ గబ్బర్ సింగే అని చెప్పాలి. ఈ సినిమా అమెరికాలో 6 లక్షల 16 వేల డాలర్లు వసూలు చేసింది. దానిపై మొదట్లనే వచ్చిన నెగటివ్ కామెంట్లు ఆ సినిమా వసూళ్లపై ప్రభావం చూపాయి. కానీ కాటమరాయుడు సినిమా అమెరికాలోని థియేటర్లలో ముందుగానే విడుదల కావడం, ఎక్కువ థియేటర్లలో వస్తుండటం ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. థియేటర్లు తొలిోజే కిక్కిరిసిపోతే పది మిలియన్ డాలర్లను కాటమరాయుడు సాధించడం పెద్ద కష్టం కాదంటున్నారు. 
 
సీట్లు నిండటం, ఎక్కువ థియేటర్లలో విడుదల కావటం, అనేది సాధ్యపడితే అప్పుడు ఈ సినిమా చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నంబర్ 150 వసూళ్లను బీట్ చేస్తుందా అనేది రంగంమీదికి వస్తుంది. తొలిరోజు కలెక్షన్ల వివరాలకు శుక్రవారం గడవాల్సిందే మరి.
 

వెబ్దునియా పై చదవండి