దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్న ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లోని కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛంతో పవన్ శుభాకాంక్షలు తెలిపి, శాలువతో సత్కరించారు.
శంకరాభరణం సినిమాను చిన్నప్పుడు చాలా సార్లు చూశానని ఆయన తెలిపారు. విశ్వనాథ్ సినిమాల్లో శుభలేఖ, శంకరాభరణం, స్వాతిముత్యం సినిమాలు తనకు చాలా ఇష్టమన్నారు.