తన పేరు పవన్ కళ్యాణ్ అని తాను అన్ని చోట్లా ఉంటానని సినీ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. తాను నటించిన "హరిహర వీరమల్లు" చిత్రం గురువారం విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని బుధవారం విశాఖలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తనకు విశాఖతో మంచి అనుబంధం ఉందన్నారు.
ఇదే విషయాన్ని చెబితే "పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడ పుట్టాను. అక్కడే పెరిగాను అంటాడు" అని అంటూ కొందరు విమర్శిస్తుంటారని వాళ్లంతా కూపస్థమండూకాలని, అంతకు మించి ఆలోచించలేరని చురకలంటించారు. తన పేరే పవన్ అని గుర్తు చేసిన ఆయన... తాను అంతటా ఉంటాని చెప్పారు.