పవన్ కళ్యాణ్ ఐదవ తరగతి విద్యార్థి కంటే తక్కువ తెలివి కలిగిన మనిషి అనీ, ఆయనో మూర్ఖుడంటూ నానా హంగామా చేస్తున్న కత్తి మహేష్ మాటల పైన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ స్పందించారు. తనకు తెలిసి ఇలాంటి వ్యక్తులందరూ ఏదో పబ్లిసిటీ కోసమే చీప్ కామెంట్లు చేస్తుంటారని పేర్కొంది. తనకు కత్తి మహేష్ ఎవరో కూడా తెలియదని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి పూర్తిగా తెలిసిన వారు ఆయనను తూలనాడలేరనీ, నోరు మూసుకుంటారని వెల్లడించారు.
కాగా సోషల్ మీడియా వేదికగా హీరో పవన్ కళ్యాణ్‌పై ఫిల్మ్ క్రిటిక్ మహేష్ కత్తి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆయన మరోమారు రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ ఓ అజ్ఞాని అని వ్యాఖ్యానించారు. పైగా, పవన్ కల్యాణ్ అజ్ఞానాన్ని తాను పట్టించుకోకుండా ఎలా ఉండగలనని ప్రశ్నిస్తున్నాడు.
బెంగుళూరులో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ రెండు రోజుల క్రితం హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ హత్యను ఖండిస్తూ గురువారం రాత్రి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఇందులో గౌరీ లంకేశ్ పేరును గౌరీ శంకర్ అని రాసుకొచ్చాడు. దీన్ని గుర్తించిన మహేశ్ కత్తి... హత్యకు గురైన జర్నలిస్ట్ పేరు గౌరీ శంకర్ కాదు గౌరీ లంకేశ్ అని పవన్‌ని ఎద్దేవా చేశాడు.
ప్రధాని మోడీ, హిందుత్వ విధానాలకు మద్దతు తెలిపిన పవన్ ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడని మహేశ్ కత్తి అన్నాడు. ఈ హత్య కేసులో నిజానిజాలు తేలేవరకు తాను ఈ హత్యపై ఎవరిపై ఎటువంటి విమర్శలు చేయబోనని పవన్ అంటున్నాడని మహేశ్ కత్తి పేర్కొన్నాడు. పవన్ కల్యాణ్ కులాలకు, మతాలకు అతీతమైన వ్యక్తని, అలాగే జ్ఞానం లేని వ్యక్తని తనకు ఇప్పుడు అర్థమైందని మహేశ్ కత్తి ఎద్దేవా చేశాడు.