ఈ చిత్రం షూటింగ్ కోసం చార్మినార్, రెడ్ ఫోర్ట్, మచిలీపట్నం పోర్ట్ వంటి భారీ సెట్లను నిర్మించారు. అంటే.. ఏ విషయంలోనూ రాజీపడని ఉన్నతస్థాయి నిర్మాణ విలువలతో, రూ. 150 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్నిరూపొందిస్తున్నారు. ఇప్పటివరకు హరిహర వీరమల్లు షూటింగ్ నలభై శాతం పూర్తయింది. జూలై నాటికి మొత్తం చిత్రీకరణనుపూర్తిచేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్తామనే ఆశాభావాన్ని నిర్మాత ఎ. దయాకర్ రావు వ్యక్తం చేశారు.