రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య, చంపేసా ఐతే ఏంటి అంటున్న హంతకుడు (video)

ఐవీఆర్

శనివారం, 13 సెప్టెంబరు 2025 (12:32 IST)
హైదరాబాదులోని కుషాయిగూడలో నడిరోడ్డుపై శ్రీకాంత్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని నడిరోడ్డుపై పొడిచి దారుణ హత్య చేసారు ఇద్దరు దుండగులు. ఈ హఠత్పరిణామంతో భీతిల్లిన స్థానికులు వెంటనే తేరుకుని హంతుకులను పట్టుకునే ప్రయత్నం చేసారు. ఇద్దరిలో ఒకడు పరారయ్యాడు. మరో నిందితుడిని స్థానికులు చుట్టుముట్టారు.
 
రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ ను ఎందుకు హత్య చేసావని స్థానికులు నిలదీస్తే.. ఒక్కడినే మీకు దొరికిపోయాను, మీరు ఏం చేస్తారో చూస్తా, హత్య చేసాను ఐతే మీకేంటి అంటూ చేతులకు అంటుకున్న రక్తాన్ని రోడ్డుపై విదిలిస్తూ ఎంతమాత్రం భయం లేకుండా ఎదురు సమాధానాలు చెబుతున్నాడు.

నడిరోడ్డులో దారుణంగా హత్య చేసి.. అయితే ఏంటి అని దర్జాగా అడుగుతున్న హంతకుడు

ఇది జరిగింది అమెరికాలో కాదు.. మన హైదరాబాద్‌లోనే!

కుషాయిగూడలో రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ రెడ్డి కత్తితో పొడిచి చంపిన ఇద్దరు దుండగులు

నిందితుల్లో ఒకరు పారిపోగా.. మరొక నిందితుడ్ని పట్టుకొని, అతడ్ని… pic.twitter.com/fS0FUC5kx9

— PulseNewsBreaking (@pulsenewsbreak) September 13, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు