'లాయర్ సాబ్‌'గా పవర్ స్టార్? రూ.40 కోట్ల పారితోషికం డిమాండ్?

బుధవారం, 6 నవంబరు 2019 (15:08 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖానికి రంగేసుకోనున్నారు. గత కొంతకాలంగా రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న పవన్... ఇక సినిమాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటనలు చేశారు. అయితే, టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు చేసిన ఒత్తిడి కారణంగా ఆయన తిరిగి సినిమాల్లో నటించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. 
 
ఇందులోభాగంగా, ఆ మధ్య హిందీలో విడులై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పింక్ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. ఇదే సినిమాను తమిళంలో అజిత్ కథానాయకుడిగా రీమేక్ చేయగా, అక్కడ కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి దిల్ రాజు రంగంలోకి దిగాడు. బోనీకపూర్‌తో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మించనున్నాడు.
 
ఈ సినిమాలో కథానాయకుడిగా పవన్ కల్యాణ్ నటిస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నాడనే విషయం ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి పవన్ అందుకోనున్న పారితోషికం గురించిన చర్చలు ఫిల్మ్ నగర్లో జోరుగా నడుస్తున్నాయి. ఈ సినిమాకి పారితోషికంగా ఆయన రూ.40 కోట్లను అందుకోనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకి 'లాయర్ సాబ్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు