పవర్ స్టార్‌తో గడపడం చాలా ఆనందంగా ఉంది.. లవ్.. లవ్.. లవ్... శ్రీముఖి (Video)

గురువారం, 5 నవంబరు 2020 (10:27 IST)
తెలుగు బుల్లితెర యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఆమె ఏ పని చేసినా అది సంచలనమే అవుతుంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఫోటోలు దిగింది. వాటిని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. పవన్‌ అన్నతో గడపడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. 
 
సాధారణంగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు సామాన్యుల్లోనే కాదు సినీ ప్రముఖుల్లో కూడా భారీ సంఖ్యలో అభిమానులున్నారు. పాలిటిక్స్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి సినిమాలు చేస్తున్న పవన్ ప్రస్తుతం 'వకీల్ సాబ్' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 
 
హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన కోర్టు సెట్‌లో పవన్‌పై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అదే స్టూడియోలో ఓ కార్యక్రమం కోసం వచ్చిన యాంకర్ శ్రీముఖి, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తదితరులు పవన్‌తో ఫొటోలు దిగారు. 
 
శ్రీముఖి ఆ ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. 'ఏం టైప్ చేయాలో నాకు తెలియడం లేదు. పవన్ కళ్యాణ్ సార్.. లవ్.. లవ్.. లవ్' అంటూ కామెంట్ చేసింది.
 
'మన "వకీల్ సాబ్" పవర్ స్టార్ పవన్‌ అన్నని ఈరోజు అనుకోకుండా కలిశాను. కాసేపు ఆయనతో గడపడం చాలా ఆనందంగా ఉంద"ని జానీ మాస్టర్  తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

Ok I don’t know what to type! ❤️@PawanKalyan sir LOVE LOVE LOVE! #Powerstar pic.twitter.com/A0g5UMYnzF

— SreeMukhi (@MukhiSree) November 4, 2020

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు