పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగుతున్న త్రివిక్రమ్.. (Video)

బుధవారం, 28 అక్టోబరు 2020 (12:03 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్నారన్న విషయం తెలిసినప్పి నుంచి చాలా మందిలో ఓ ప్రశ్న తలెత్తింది. అది ఏంటంటే.. పవన్‌కి అత్యంత సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కదా. మరి.. పవన్ రీ-ఎంట్రీ మూవీని త్రివిక్రమ్ డైరెక్షన్ లోనే చేయచ్చు కదా అని. అలా జరగకపోవడంతో పవన్ - త్రవిక్రమ్ మధ్య గ్యాప్ వచ్చిందా..? ఇద్దరికీ ఏమైనా గొడవలు జరిగాయా..? ఇలా అనేక ప్రశ్నలు.
 
వకీల్ సాబ్ తర్వాత సినిమా అయినా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఉంటుంది అనుకుంటే.. అదీ జరగలేదు.
క్రిష్‌తో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్‌తో మూవీ, సురేందర్ రెడ్డితో మూవీ చేయనున్నారు. లేటెస్ట్‌గా యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్రతో ఓ మూవీ చేయనున్నారు. అయితే.. ఇప్పుడు పవన్ కోసం త్రివిక్రమ్ రంగంలోకి దిగారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ మేటర్ ఏంటంటే... సాగర్ చంద్ర పవన్‌తో చేయనున్న మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాస్తున్నారట.
 
ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది. దసర సందర్భంగా ఈ సినిమాని ఎనౌన్స్ చేసారు. గతంలో ఇలాగే పవన్ సినిమాకి ఆయన దర్శకత్వం వహించకపోయినా తీన్ మార్ మూవీకి సంభాషణలు రాసారు. మళ్లీ ఇప్పుడు పవన్ మూవీకి దర్శకత్వం వహించకపోయినా సంభాషణలు అందిస్తుండడం విశేషం.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు