జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్, ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్‌ల మధ్య సత్ సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పే సంఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది. కేవలం ఒక నటుడిగానే కాకుండా, మంచి మానవత్వం ఉన్న మనిషిగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
గతంలో ఆపదలో ఉన్న వారినెందరినో ఆదుకున్న పవన కళ్యాణ్... కష్ట సుఖాల్లో ఉన్న వారికి తన ఆశీస్సులు అందించి అండగా నిలిచారు. తాజాగా ఓ కాలేజ్ విద్యార్థి కాలేజ్ ఫీజు చెల్లించి తనకు తానే సాటి అని మరో సారి నిరూపించుకున్నారు. అదీ కూడా తన మాజీ భార్య రేణూ దేశాయ్ సూచన మేరకు ఈ ఫీజు చెల్లించి రియల్ హీరో అనిపించుకున్నారు.
లక్ష్మీదుర్గా డేగల అనే డిగ్రీ విద్యార్థి ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేసింది. తన తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయారనీ, తాను కాలేజీ ఫీజు చెల్లించలేకపోతున్నాననీ, ఎవరైనా దాతలు రూ.4000 చెల్లించండి అంటూ అందులో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై ఎవరు స్పందించలేదు. కానీ రేణూ దేశాయ్ స్పందించారు. రేణూ దేశాయ్ తన మేనేజర్ ద్వారా ఆ అమ్మాయి వివరాలు సేకరించి, ఆ వివరాలను పవన్‌కు పంపించారు.
పవన్ వెంటనే తన మేనేజర్ ద్వారా ఆ అమ్మాయిని కలిసి మొత్తం ఫీజుని చెల్లించారు. ఈ క్రమంలో లక్ష్మీ దుర్గా పవన్, రేణూలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. వెంటనే రేణూ కూడా ఆ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. 'బాగా చదువుకొని, మీ తల్లితండ్రులకు మంచి పేరు తేవాలని .. అప్పుడే నేను హ్యపీగా ఫీలవుతానంటూ' పేర్కొంది.