ప్రైవేట్ పార్టులో పవన్ టాటూ, పవన్ కళ్యాణ్‌కి నాలుగో భార్యగా నేను రెడీ అంటున్న నటి (Video)

మంగళవారం, 2 మార్చి 2021 (13:21 IST)
పవన్ కళ్యాణ్ సినిమాలో తాను న‌టిస్తున్నాన‌ని బిగ్‌బాస్ ఫేమ్ హిమ‌జ(అషు రెడ్డి) ఇటీవ‌లే సోష‌ల్‌మీడియాలో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆమెతో ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతున్నారు. ఓ నెటిజన్... పవన్ కళ్యాణ్ గారు తనకు నాలుగో భార్యగా మీకు అవకాశం ఇస్తే పెళ్లాడుతారా అని అడిగేశాడు. ఈ ప్రశ్నకు అన్షు రెడ్డి ఎంతమాత్రం తడుముకోకుండా ఆయన కోసం ప్రాణాలనే ఇస్తాను. భార్యగా వుండమంటే అంతకంటే ఇంకేం కావాలి అంటూ సమాధానం ఇచ్చింది. ఆ దెబ్బతో సదరు ఫ్యాన్ మళ్లీ అలాంటి ప్రశ్న అడగలేదు.
 
ఇకపోతే పవన్ సినిమా చేస్తున్న అన్షు రెడ్డికి తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆమెకు లెట‌ర్ ద్వారా రిప్ల‌యి ఇచ్చాడు. అది కూడా చేతితో వైట్ పేప‌ర్‌లో పెన్‌తో రాసిన కాగితం ముక్క‌ను ఆమె అందుకుంది. దాంతో హిమ‌జ ఆనందానికి అవ‌ధులులేవు. ఉబ్బి త‌బ్బిబ‌యింది. పవన్ తనకు రాసిన లేఖను హిమజ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
 
`హిమజ గారికి, మీకు అన్ని శుభాలు జరగాలని, వృత్తిపరంగా మీరు ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను` అని పేర్కొంటూ పవన్‌ ఓ లేఖను హిమజకు పంపించారు. ఈ లేఖను హిమజ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ `నా ఆనందాన్ని మాటల్లోనూ చెప్పలేకపోతున్నానని వెల్లడించింది.
 
 
డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రంలో పవన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ పాత్రకు హిమజ ఎంపికైంది. పవన్‌తో దిగిన సెల్ఫీలను ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ విష‌యం తెలిసిన ఆమె స‌న్నిహితులు హిమ‌జ‌కు ఆల్‌ది బెస్ట్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు