ఆర్.ఎక్స్-100 సినిమాతో నేను ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాను. నా కెరీర్‌ను మార్చేసింది. సినిమా చేస్తున్నప్పుడు హిట్ అవుతుందని అనుకోలేదు. ఆ సినిమా రిలీజ్ రోజు హైదరాబాద్‌లోని థియేటర్‌లో మార్నింగ్ షో11గంటలకు వెళితే థియేటర్లో రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత కెరీర్ సాఫీగా సాగుతుంది అనుకున్నాను. కానీ దాన్ని మెయింటెన్ చేయలేకపోవడమే పెద్ద సమస్యగా మారింది. కొంతమంది నన్ను రాంగ్‌వేలో తీసుకెళ్ళారు.
ముఖ్యంగా నా మేనేజర్ నన్ను తప్పుదోవ పట్టించారు. డబ్బుల కోసం వాళ్ళు ఇష్టంవచ్చినట్లు సినిమాలకు డబ్బులు తీసేసుకున్నారు. మా అమ్మ, నాన్నలకు ఈ రంగంలో పెద్దగా అనుభవంలేదు. అందుకే నేను మేనేజర్‌ను, కొంతమంది మాటలు నమ్మి నేను చాలా నష్టపోయాను.
ఓవర్‌నైట్ స్టార్ అయ్యాక నా కెరీర్ వెనకగుడువేయడానికి ఇదే పెద్ద కారణం. ఆ టైంలో ముంబైలో నేను రెంట్ కట్టేందుకు డబ్బులుకూడా సంపాదించుకోలేకపోయాను. ఇదంతా ముగ్గురు వ్యక్తులు వల్ల నేను నష్టపోయాను. జీవితం ఒకేసారి పాఠం నేర్పుతుంది. అది నేను ఆర్.ఎక్స్. 100 తర్వాత పెద్ద పాఠం నేర్చుకున్నాను. అంటూ మేనేజర్లు ఏ విధంగా మోసం చేస్తారో వివరించింది.