ప్రముఖ యాంకర్ ప్రదీప్ నిర్వహించే.. పెళ్లిచూపులు షోపై ఓ షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. తెలుగు సంప్రదాయాలకు విరుద్ధంగా ఈ షో నడుస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ ఉత్తుత్తివేనని.. ఈ షోలో పాల్గొనే యువతులందరూ.. షార్ట్ ఫిల్మ్ నటీమణులని తెలియవచ్చింది. ఈ షోలో పాల్గొన్న అమ్మాయిల్లో దాదాపు చాలా మంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే అని తెలుస్తోంది.
ప్రదీప్ మీద ప్రేమతో అమ్మాయిలు ఈ షోకి రాలేదని, తమ కెరీర్‌ని బిల్డ్ చేసుకుందామని వచ్చినట్లు కామెంట్స్ చేశారు. షోలో ఒకరిద్దరు తప్పించి మిగిలిన వాళ్లు మాత్రం ఈ షోతో పాపులర్ అవ్వాలనే వచ్చినట్లు స్పష్టమవుతోంది.
షోలో పాల్గొన్న జ్ఞానేశ్వరి, గీతిక, యశ్వి వంటి అమ్మాయిలు షార్ట్ ఫిలింలో హీరోయిన్లుగా నటించారు. దివ్య డెకాటే మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సో.. ఈ షోతో సమాజానికి ఏమాత్రం చెడు జరగదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.