ప్రముఖ నిర్మాతలు శరత్ మరార్, జెమినీ కిరణ్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా స్క్రిప్ట్‌ను చిత్రయూనిట్‌కు అందించారు. సినిమా సక్సెస్ అవ్వాలని చిత్రయూనిట్‌కు విషెస్ అందజేశారు.
ముహుర్తం షాట్‌కు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించగా నిర్మాత రాజశేఖర్ రెడ్డి క్లాప్ కొట్టారు. నిర్మాత కూతురు, కొడుకు ఈశన్వి, ధృవ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు నైపుణ్యంగల సాంకేతిక బృందం పని చేస్తోంది. డైరెక్టర్ గ్యారీ బీహెచ్ స్వతాహాగా ఎడిటర్ కావడంతో ఈ సినిమాకు కూడా ఎడిటింగ్ బాధ్యతలను తీసుకున్నారు. మనోజ్ రెడ్డి కెమెరామెన్‌గా, శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.
దర్శకుడు, ఎడిటర్ : గ్యారీ బీహెచ్, నిర్మాత : కే రాజశేఖర్ రెడ్డి, సహ- నిర్మాత : చరణ్ తేజ్, రచయిత : అనిరుధ్ కృష్ణమూర్తి, సంగీతం : శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి.