కంగనా వేస్తున్న ప్రశ్నలకు ఆమె సమాధానం ఇస్తూ, ఒకానొక సమయంలో తన తల్లిదండ్రులే తనను మెడ పట్టి బయటికి గెంటేసినట్లు పేర్కొంది. నాలుగేళ్లపాటు తల్లిదండ్రులతో కలిసి ఉన్నాను.. అయితే ఒకరోజు ఏమి జరిగిందో తెలియదు.. నాకు ఏ కారణం చెప్పకుండా నా తల్లిదండ్రులే నన్ను మెడపట్టుకొని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు.
కారణం ఏంటి అని నేను అడిగినా సమాధానం చెప్పలేదు. నన్నెప్పుడు నా కుటుంబం డబ్బులు యంత్రంలా మాత్రమే చూసింది. మొన్నీమధ్య తన భర్త తనను ఎంత వేధించాడో చెప్పి కంటనీరు పెట్టించింది. అదో చీకటి కోణంగా అభివర్ణించింది. పూనమ్ మాటలకు అక్కడివారంతా కనెక్ట్ అయి కంటతడి పెట్టారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ నెట్టింట వైరల్ అవుతుంది.