ఆ రావి చెట్టును కుర్రాళ్లందరూ కలిసి గట్టిగా పట్టుకున్నారు. ఇసుక బస్తాలు నింపి దాని మొదట్లో కుమ్మరించారు. ఆ తర్వాత ఏకంగా ఓ సిమెంట్ బెంచినీ తీసుకుని వచ్చి ఆ చెట్టును దానికి గట్టిగా తాళ్లతో కట్టేసారు. అలా చెట్టును కూలిపోకుండా రక్షించారు. వృక్షో రక్షతి రక్షితః... మనం చెట్లను సంరక్షిస్తే, అవి మనకు జీవనాధారంగా మారి, మన మనుగడకు తోడ్పడతాయి.