రాజమౌళి మల్టీస్టారర్ చిత్రంలో విలన్‌గా పాపులర్ హీరో !

సోమవారం, 29 జనవరి 2018 (15:58 IST)
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి "బాహుబలి" తర్వాత ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్ తేజ్ హీరోలుగా నటించనున్నారు. అయితే, ఈ చిత్రంలో విలన్‌గా కూడా ఓ పాపులర్ హీరోనే ఎంపిక చేసినట్టు ఓ వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది.
 
'బాహుబలి' చిత్రంలో హీరో దగ్గుబాటి రానాను విలన్‌గా రాజమౌళి చూపించిన తీరు ప్రతి ఒక్కరినీ ఇట్టే ఆకర్షించింది. ఇపుడు కూడా తాను చేపట్టే మల్టీస్టారర్ చిత్రంలోనూ విలన్ పాత్రను ఓ పాపులర్‌తో వేయిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
ఈ మల్టీస్టారర్ చిత్రంలో పాపులర్ హీరో అయితేనే బాగుంటుందని భావించిన రాజమౌళి పలువురి పేర్లని కూడా సెలక్ట్ చేసినట్టు టాక్. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మల్టీ స్టారర్ మూవీ కోసం కథని సిద్ధం చేస్తున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు