ముఖపక్షవాతంతో బాధపడుతున్న జస్టిన్ బీబర్‌‌

శనివారం, 11 జూన్ 2022 (12:51 IST)
pop SInger
పాప్ సింగర్‌ జస్టిన్ బీబర్‌ అనారోగ్యం బారినపడ్డాడు. బీబర్ ముఖ పక్షవాతంతో బాధపడుతున్నాడు. తాను 'రామ్‌సే హంట్ సిండ్రోమ్' బారినపడటం వల్లే ఇలా పక్షవాతం వచ్చినట్లు బీబర్ తెలిపాడు. 
 
ప్రస్తుతం తాను అనారోగ్యంతో బాధపడుతున్నందునా.. తన షోలను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో జస్టిన్ బీబర్ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. 
 
కాగా పక్షవాతం కారణంగా తన ముఖంలోని కుడి వైపు భాగాన్ని కదిలించలేకపోతున్నాడు. కుడి కన్ను రెప్ప వేయలేకపోతున్నాడు. నవ్వినప్పుడు పెదాలు కేవలం ఎడమవైపు తప్ప కుడివైపుకు కదిలించలేకపోతున్నాడు. 
 
ముక్కులో కుడివైపు రంధ్రం కదలిక లేదు. స్వయంగా ఇన్‌స్టాలో ఈ విషయాన్ని ఈ పాప్ సింగర్ తెలియజేయడంతో ఆయన త్వరలో ఈ అనారోగ్య బారి నుంచి బయటపడాలని ఫ్యాన్స్, సన్నిహితులు ఆకాంక్షిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు