"డీఆర్ 50" పేరిట దిల్ రాజు బర్త్‌డే సెలెబ్రేషన్స్ - హాజరైన సినీ దిగ్గజాలు!
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (14:44 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు గత రాత్రి తన 50వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. "డీఆర్ 50" పేరిట జరిగిన వేడుకలు గురువారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని నివాసంలో వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో టాలీవుడ్ ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తళుక్కున మెరిశారు.
తన పుట్టిన రోజును పురస్కరించుకొని ముందు రోజు రాత్రి(గురువారం) టాలీవుడ్ ప్రముఖులకు దిల్‌రాజు గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశారు. వేడుకగా నిర్వహించిన ఈ పార్టీలో టాలీవుడ్ తారలతోపాటు సౌత్ ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చింది. ఈ పార్టీకి దిల్ రాజు భార్య తేజస్విని ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఈ ఏడాది మేలో దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన భార్య తేజస్వినిని ఇండస్ట్రీ మిత్రులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో దిల్ రాజు ఈ వేడుక ఘనంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు ఇపుడు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. పవన్ మాత్రమే కాదు మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, ప్రభాస్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, కన్నడ హీరో యశ్ వంటి అగ్రతారలు దిల్ రాజు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.
అలాగే, అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రాశీ ఖన్నా, అనుపమ పరమేశ్వరన్, నివేదా పేతురాజ్ తమ బ్యూటిఫుల్ అందాలతో కనువిందు చేశారు. మరోవైపు సెలబ్రిటీ కపూల్స్, సమంత - చైతన్య, నితిన్ తన భార్యతో కలిసి రావడం విశేషంగా నిలిచింది. వీరంతా 'దిల్ రాజు 50' అనే బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ పార్టీకి చెందిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఏదో చేయాలనివుందంటున్న ఏస్ ప్రొడ్యూసర్
మనిషి ఎప్పుడూ ఒకేలా వుండడు. మారుతూ వుంటారు. అందుకు పరిస్థితులు కానీ, వైవాహిక జీవితంలో ప్రవేశించినవారు కానీ మనసును మార్చితేనే కిక్ వుంటుంది. ఎప్పుడూ సినిమాలు, షూటింగ్‌లు, ఎగ్జిబిటర్‌గా లెక్కలు వేసుకోవడం, పంపిణీదారుడిగా ఏఏ సినిమాలు కొనాలి.. ఎంత లాభాలు వస్తాయి అనే వాటిపై ఎక్కువగా శ్రద్ద పెట్టిన దిల్‌రాజు.. ఇప్పుడు జీవితంలో ఏదో చేయాలనే ఆలోచనలో పడ్డాడు.
ఇదంతా తన జీవితంలో రెండో భార్య ప్రవేశించాక జరగడం విశేషమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకోవైపు... బాలీవుడ్లో సోనూసూద్ సేవా కార్యక్రమాలు కూడా ఓరకంగా ఆయన్ను ప్రేరేపించాయని చెప్పవచ్చు. విశేషం ఏమంటే.. ఎప్పుడూ మీడియాకూ దూరంగా వుండే దిల్‌రాజు.. తన 50వ పుట్టినరోజు వేడుకను వారి సమక్షంలో జరుపుకోవడం విశేషం.
ఈనెల 18న తేదీ ఆయన పుట్టినరోజు. అందుకే లెక్కప్రకారం అంటే.. ఓవర్సీస్ ప్రకారం.. 17వ తేదీ రాత్రి 7.30 నిముషాలకు.. అక్కడ 18వ తేదీ వస్తుంది కాబట్టి... హైదరాబాద్‌లో ఆ టైంలో అందరితో సరదాగా గడుపుతూ కేక్ కట్ చేస్తూ తన రెండో ఇన్నింగ్సు ఎలా వుంటాయో తెలియజేశాడు. ఆయన మాటల్లోనే విందాం.
మేరేజ్ నాకు సెకండ్ లైఫ్.. మా కుటుంబంతో కలిసి మీ వద్దకు వద్దామనుకున్నాం. కానీ సాధ్యపడలేదు. ఇంటిలో చిన్న ఫంక్షన్ వుంది. అందుకే రాలేకపోయాం. నేను మిమ్మల్నిని కలుద్దామని అనుకున్నా. జీవితంలో ఇప్పటివరకూ కొన్ని సాధించాం. ఇంకా ఏదో చేయాలనే తపన వుంది. ప్రతి ఒక్కరూ ఒక స్థాయి వచ్చాక మన కోసం బతుకు, సంపాదన చేశాక.. ఏదో వెలితిగా వుంటుంది.
తర్వాత ఏమిటి? అనేది తొలుస్తుంది. అందుకే అలా ఆలోచించగా సామాజిక సేవ చేయాలని తట్టింది. ముఖ్యంగా మంచి పని చేయాలంటే మీడియా సపోర్ట్ కావాలి. ఎందుకంటే.. దిల్‌రాజు సేవ చేస్తాడంటే ఎవరెవరో వస్తారు. అందులో నిజాయితీగా ఎవరికి అవసరం అనేది తెలీదు. అందుకే మీడియా సాయం కావాలి.
వచ్చిన వారిలో ఏది కరెక్ట్ అనేది నేనొక్కడే చెప్పలేను. అందుకే నాకొక టీమ్ కావాలి. అందులో మీడియా కూడా బాగుంటుంది. మీ వద్దకు జన్యూన్ సమస్యలుంటే మా దగ్గరకు వచ్చి తీసుకురండి.. మీలో ఎవరైనా పర్సనల్‌గా సోషల్ సర్వెస్ వున్నవారు మాతో జాయిన్ అయితే బాగుంటుంది.
ముఖ్యంగా ఎడ్యుకేషన్, ఆరోగ్యం గురించి సేవ చేయాలనే అనుకున్నాను. చదవాలనుకుని ఆర్థికంగా చేయూత లేనివారు, అనారోగ్యంతో బాధపడుతూ.. వైద్యం చేయించుకోనివారి కోసమే ఈ సేవ మొదలు పెట్టాను. అలాగే మీడియాలోనూ అందరూ ఒక రీతిలో వుండరు. వారుకూడా ఇందులో పాల్గొనవచ్చు. ఎవరికైనా అవసరం వుంటే మమ్మల్ని సంప్రదించండి అంటూ చెప్పారు.
సో.. బడా నిర్మాత సేవ వైపు వెళ్ళాడు. అంటే సినిమాలు కూడా వరసుగానే వుంటాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో "వకీల్ సాబ్" రన్నింగ్‌లో వుంది. నిన్ననే.. తన పుట్టినరోజు సందర్భంగా 'ఎఫ్3' సినిమా కూడా మొదలు పెట్టాడు. ఇంకాలు పలు చిత్రాలు లైన్లో వున్నాయి.