గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. వయోబేధం లేకుండా హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా శనివారం రామభద్రపురం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌లో డ్యూటీలో ఉండగా ఒక బస్సు కండక్టర్ గుండెపోటుతో మరణించాడు. మృతుడిని దాసుగా గుర్తించారు.
సాలూరు నుండి విశాఖపట్నం వెళ్తున్న బస్సులో వాహనం బస్సు కాంప్లెక్స్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే అకస్మాత్తుగా తన సీటులో కుప్పకూలిపోయాడు.
అప్రమత్తమైన ప్రయాణికులు, సిబ్బంది వెంటనే అతన్ని చికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినప్పటికీ, చికిత్స పొందుతూ దాసు మరణించాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.