ఈ సందర్భంగా భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. టి సిరీస్‌లో కొత్త ఐడియాలు, కొత్త కాన్సెప్ట్‌లు ఎప్పుడూ మేము ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాం. ఫిలిం మేకింగ్‌లో సరికొత్త టెక్నాలజీని వాడుకుంటూనే ఉన్నాం. ఓం ఆయన టీం కలిసి ఆదిపురుష్ లాంటి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. దానికోసం ఇంటర్నేషనల్ సినిమాలో వాడే లేటెస్ట్ టెక్నాలజీ వాడుకుంటున్నారు. తొలిసారి ఇండియాలో అంత భారీ టెక్నాలజీని ఉపయోగించుకోబోతున్నాం. బాహుబలి స్టార్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ అద్భుతాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం.. అని తెలిపారు.
నిర్మాత ప్రసాద్ సుతార్ మాట్లాడుతూ.. సాధారణంగా ఇంటర్నేషనల్ సినిమాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విజువల్ ఎఫెక్ట్స్ వాడుతుంటారు. ఫిలిం మేకర్స్ కు వాళ్ళ కథ చెప్పడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆదిపురుష్ లాంటి ఒక అద్భుతమైన ప్రపంచం సృష్టించడానికి మేము కూడా ఇదే చేయబోతున్నాం. ఈ సినిమా మా అందరికీ ఒక ఒక మైలురాయి లాంటిది. భూషణ్ జీతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా వేచి చూస్తున్నాము.. అని తెలిపారు.
రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న , ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టి సిరీస్ బానర్ పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ సహ నిర్మాతలు. ఫిబ్రవరి 2, 2021నాడు ఆదిపురుష్ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అవ్వనుంది.