కేరళ వరదలు... కోటి రూపాయలు విరాళం ఇచ్చిన 'బాహుబలి'

మంగళవారం, 14 ఆగస్టు 2018 (14:37 IST)
కేరళ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకోగా మరెందరో నిరాశ్రయులయ్యారు. అక్కడి పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చిందని కేరళ ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నేపధ్యంలో కేరళ ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు ముందుకు వచ్చారు. 
 
బాహుబలి హీరో ప్రభాస్ కోటి రూపాయలను విరాళంగా ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. సినీ ఇండస్ట్రీలో ఇంతమొత్తం ఇప్పటివరకూ కేరళ వరద సాయంగా ప్రకటించలేదు. ఇకపోతే అల్లు అర్జున్ రూ. 25 లక్షలు చెక్కును కేరళ ప్రభుత్వానికి అందించారు. తమిళ హీరోలు సోదరులు సూర్య, కార్తి ఇటీవల తమిళనాడు రైతు సంఘానికి రూ.కోటి విరాళం ఇచ్చి తమ ఉదారతను చాటారు. ఇప్పుడు కేరళ వరద బాధితులకు రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు