అమెరికా నుంచి రెస్ట్ తీసుకుని రాగానే.. ''సాహో'' కోసం ప్రభాస్ ఆరునెలలు.. రూ.400కోట్లతో.?

శనివారం, 27 మే 2017 (13:24 IST)
ప్రభాస్ సాహో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ''బాహుబలి ది కంక్లూజన్'' తర్వాత అంతర్జాతీయ స్టార్‌గా ఎదిగిపోయిన ప్రభాస్.. విశ్రాంతి తీసుకునేందుకు అమెరికా వెళ్లిపోయాడు. త్వరలోనే తిరిగి భారత్‌కు రానున్న ప్రభాస్.. సాహో సినిమా షూటింగ్‌లో పాలుపంచుకుంటాడని టాక్ వస్తోంది. సుజిత్ డైరెక్షన్‌లో ‘సాహో’ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 
 
అంతర్జాతీయ సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజైంది. ఈ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో భారీ క్రేజ్ లభించింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ అమెరికా నుంచి రాగానే అధికారికంగా సాహో చిత్ర షూటింగ్‌ను ప్రారంభించాలని.. ఏకధాటిగా షూటింగ్‌ జరిపి ఆరు మాసాలకే సినిమాను పూర్తి చేయాలని సినీ యూనిట్ భావిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ముంబై, అబుదాబిల్లో జరుగుతుందని తెలుస్తోంది. 
 
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడిగా ముందుగా బాలీవుడ్ హీరోయిన్‌ని అనుకున్నారు. కానీ కథకు అనుగుణంగా తెలుగు హీరోయిన్లనే తీసుకోవాలని ప్రస్తుతం నిర్మాతలు భావిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. ఇకపోతే.. ఈ సినిమా కోసం బిగ్ డీల్ కుదిరిందని టాక్. భారత్‌లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు రూ.400 కోట్ల మేర పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి