ఎస్ఎస్ రాజమౌళి తనను మోసం చేశారంటూ టాలీవుడ్ ప్రతినాయకుడు ప్రదీప్ రావత్ అంటున్నారు. అలాగే, రాజమౌళి తనకు గురువు అని, ఆయన రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేనని చెపుతున్నారు. ఇంతకీ ప్రదీప్ రావత్ ఇలా ఎందుకు అన్నారో పరిశీలిద్ధాం.
రాజమౌళి 'లగాన్' చిత్రం చూసి నా నటన మెచ్చుకుంటూ తన మేనేజర్‌ను ముంబైలోని అమీర్‌ఖాన్ ఆఫీసుకు పంపించారు. అక్కడ నా అడ్రస్ తెలుసుకుని ఆ మేనేజర్ మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. ఆ వెంటనే రాజమౌళితో ఫోన్లో మాట్లాడాను. నన్ను హైదరాబాద్ రమ్మని చెప్పారు. నేను వెళ్లి ఆయన కలవడం, ఆయిన ఇచ్చిన ఆఫర్‌కు ‘సై’ అనడం జరిగాయి. తెలుగులో నేను నటించిన మొదటి చిత్రం ‘సై’. సూపర్‌హిట్ మూవీ. ఈ చిత్రంలో అంత బాగా నటిస్తానని నేనే అనుకోలేదు. ఇక అప్పటి నుండి తెలుగులో మంచిపాత్రల్లో నటించేందుకు అవకాశాలు రావడం ఆరంభమైంది.
అయితే, బాహుబలిలో ఎంత చిన్న పాత్ర ఇచ్చినా చేయాలనే కుతూహలం ఉండేది. అందులో నటించలేకపోయాననే బాధ ఉంది. బాహుబలి–2కి కూడా నన్ను పిలవకపోవడం ఇంకా బాధ అనిపించింది. హమ్ జబర్దస్తీ నయ్ జా సక్తేనా (బలవంతంగా వెళ్ళి అడగలేనుగా). పిలవకపోవడానికి బలమైన కారణం ఉండే ఉంటుందేమో! అది ఆయనకే వదిలేద్దాం. అయినా గానీ రాజమౌళి నాకు ఎప్పటికీ గాడ్ ఫాదరే. భవిష్యత్తులో ఎప్పటికైనా మళ్ళీ ఆయన చిత్రంలో నటించాలని ఉందని చెప్పారు.