ఓ వైపు గేదె ప్రసవం, మరో వైపు హీరో జననం.. ఈ రెండింటికి ఏదో లింక్ ఉన్నట్టుగా చూపించడం.. చివరకు హీరో కాస్తా మహిషాసురుడు అయ్యాడన్నట్టుగా వెరైటీ గెటప్‌లో కనిపించే షాట్ అదిరిపోయింది. చూస్తుంటే పాన్ ఇండియాకు పర్ఫెక్ట్ సబ్జెక్ట్ అన్నట్టుగా కనిపిస్తోంది. విజువల్స్, ఆర్ఆర్ కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి.
మా భాష, సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, మా మూలల్లోంచి కథలు తీసుకుని తెరపై ఆవిష్కరించాలని అనుకుంటున్నామని దర్శక నిర్మాత గురుదత్త గనిగ తెలిపారు.