హాలీవుడ్ యాక్షన్ ప్రపంచాన్ని షేక్ చేయడానికి ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ సిద్ధమైంది. దర్శకుడు డాన్ ట్రాచెన్‌బర్గ్ నుంచి వస్తున్న ఈ సినిమా అంచనాలకు మించి ఉందని ఫస్ట్ స్క్రీనింగ్ రిపోర్ట్స్  తెలియజేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చిత్రం ఒక సూపర్ హార్ట్ టచింగ్ ఎంటర్టైనింగ్, యాక్షన్ అడ్వెంచర్ అని రిపోర్టులు చెబుతున్నాయి. Badlands కేవలం రక్తపాతం, వేట గురించి మాత్రమే కాకుండా యాక్షన్, సై-ఫై, మానవ సంబంధాలతో కూడిన ఒక మాస్టర్‌పీస్ అని క్రిటిక్స్ కొనియాడుతున్నారు. All killer, no filler - ఇది ఫన్, ఎమోషన్ నిండిన గెలాక్సీ రోడ్ మూవీ" అని రివ్యూలు దూసుకుపోతున్నాయి.