ఒక్క కన్నుగీటితో కుర్రకారు మతి పోగొట్టిన మలయాళీ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. 'ఒరు ఆదార్ లవ్' చిత్రంలో ఆమె నటించింది. ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో కన్నుగీటి కుర్రకారునుకాదు.. దేశం యావత్‌ను తనవైపునకు తిప్పుకుంది. ఈ చిత్రం విడుదల కాకముందే ఆమె స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ కన్నుగీటి రాత్రికి రాత్రే ఆమెను స్టార్‌ను చేసేసింది.
మలయాళం, తెలుగు రెండు వెర్షన్లలో కూడా ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్రానికి సంబంధించి ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అల్లు అర్జున్ హాజరై హుషారెత్తించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రంలోని 'ఫ్రీక్ పిల్ల' ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు.
ఈ సాంగ్ ప్రియా లుక్స్ మరోసారి కుర్రకారు హృదయాలను హత్తుకునేలా ఉంది. అద్భుతమైన కొరియోగ్రఫీతో పాటు.. అందుకు తగిన విధంగా సంగీతం కుదిరింది. ఇకపోతే, ఈ పాటలో ప్రియా వారియర్ ప్రదర్శించిచన హావభావాలకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు. ఈ పాటలో ప్రియాతో పాటు రోషన్ అబ్దుల్, నోరిన్ షరీఫ్ అదరగొట్టారు. ఈ పాటను మీరూ ఓసారి చూడండి.