విల‌న్ కావాలని వ‌చ్చి... పెళ్లిచూపులు కామెడీ రోల్ చేశా: ప్రియ‌ద‌ర్శి

గురువారం, 20 జూన్ 2019 (16:00 IST)
సాధారణంగా డాక్టర్‌ని కాబోయి యాక్టర్‌ని అయ్యానండీ అనే వాళ్ల సంగతి తెలిసిందే కానీ... విలన్‌ని కావాలనుకుంటే కమెడియన్‌ని అయిపోయాను బాబోయ్ అంటున్నాడు ప్రియదర్శి.


వివరాలలోకి వెళ్తే... `పెళ్లి చూపులు` సినిమాతో ఒక్క‌సారిగా లైమ్‌లైట్‌లోకి వ‌చ్చేసిన ప్రియద‌ర్శి... ఆ సినిమాలో తెలంగాణ యాస‌లో సిరీయ‌స్‌గా కామెడీ చేసి అంద‌ర్నీ న‌వ్వించేసాడు. అయితే తాను క‌మెడియ‌న్ అవుతాన‌ని క‌ల‌లో కూడా అనుకోలేద‌నీ, అప్పట్లో విల‌న్ కావాలనేదే తన ల‌క్ష్య‌ంగా ఉండేదని ప్రియ‌ద‌ర్శి తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
 
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ... `కోట శ్రీనివాస రావు, ప్ర‌కాష్ రాజ్ స్థాయి విల‌న్ కావాల‌నేది నా ల‌క్ష్యంగా ఉండేది. మొద‌ట `టెర్ర‌ర్‌`, `బొమ్మ‌ల‌రామారం` రెండు సినిమాలలో నేను విల‌న్‌గానే న‌టించాను. 
 
అయితే ఆ తర్వాత కాలంలో కేవ‌లం అవ‌కాశాల్లేక పోవ‌డం వ‌ల్ల మాత్రమే `పెళ్లిచూపులు` సినిమాలోని కామెడీ రోల్‌కి అంగీక‌రించాను. అది అంత క్లిక్ అవుతుంద‌ని ఊహించనే లేదు. ఆ పాత్ర‌కు వ‌చ్చిన రెస్పాన్స్ చూసి షాక‌య్యాను‌` అని చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు