ప్రముఖ నిర్మాత కేఎస్. రామారావును జూబ్లీహిల్స్ పోలీసుల అరెస్టు చేసి, ఆ తర్వాత విడుదల చేశారు. గత నెల 2వ తేదీన జూబ్లీహిల్స్‌లోని దైవసన్నిధానం ఆనుకుని ఉన్న కల్చరల్ క్లబ్లో పార్కింగ్‌కు అక్రమంగా ఒక ఫ్లోర్ వేయడంతో అది కూలిపోయి ఇద్దరు కూలీలు దుర్మరణం పాలైన విషయం తెల్సిందే.
ఈ ఘటనలో క్లబ్ ప్రెసిడెంట్‌గా కె.ఎస్.రామారావును, కార్యదర్శిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి వెంటనే బెయిల్‌పై విడుదలచేశారు. గతంలోనే ఈ క్లబ్ కట్టడాలపై కొందరు చిన్న నిర్మాతలు కలెక్టర్‌కు ఫిర్యాదులు ఇచ్చిన దాఖలాలు వున్నాయి.