నిర్మాత నట్టి కుమార్‌కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

ఆదివారం, 28 ఆగస్టు 2016 (15:55 IST)
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంచలన ఆరోపణలు, వ్యాఖ్యలు చేసే సినీ నిర్మాత నట్టి కుమార్ ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఛాతికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్టు సమాచారం. నట్టి కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు తెలిపారు. 
 
కాగా, ఇటీవల నట్టికుమార్ పలు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా.. గ్యాంగ్‌స్టర్ నయీంతో పలువురు సినీ ప్రముఖులకు సంబంధాలు ఉన్నట్టు ప్రకటించారు. ఈ ఆరోపణలపై సినీ నిర్మాత సి కళ్యాణ్ ఘాటుగానే స్పందించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి