కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్, రాధికా పండిట్‌లు హీరో హీరోయిన్లుగా రెబెల్‌స్టార్ అంబరీశ్ దునియా సూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''దొడ్మనేహుడుగ''. విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం కోసం పునీత్ తఅభిమానులు వినూత్న ఆఫర్ ప్రకటించారు. మొదటి ఆట వీక్షించే ప్రేక్షకులకు ఉచిత బిరియానీ, లడ్డూలను పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరో పునీత్ రాజ్‌కుమార్ రోడ్డు పక్కన బిర్యానీ పాయింట్ నడిపే వ్యక్తిగా కనిపించనున్నాడు.
దీంతో ఈ చిత్రానికి మరింత హైప్ తీసుకు వచ్చేందుకు ఈ సూపర్ ఆఫర్ ప్రకటించారు. పునీత్‌కు ఇది 25వ సినిమా కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మరోవైపు బెంగళూరు నగరంలోని చామరాజ్‌పేటకు చెందిన గణేశ్ స్వీట్స్ యజమాన్యం ఆధ్వర్యంలో ప్రేక్షకులకు రాజ్‌కుమార్ లడ్డూలను పంపిణీ చేయనున్నట్లు సమాచారం. బిరియానీతో పాటు చిత్రం విడుదల సమయంలో థియేటర్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న పునీత్‌రాజ్ కుమార్ భారీ కటౌట్‌కు అభిమానులు రూ.25 లక్షలు ఖర్చు చేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ఇక ఈ సినిమా ఆడుతున్న అన్ని థియేటర్లలోను తొలి ఆట చూసే వారికి బిర్యానీతో పాటు లడ్డూలను ఇస్తున్నట్టు పునీత్ ఫ్యాన్స్ చెపుతున్నారు. సో మొత్తానికి ''దొడ్మనేహుడుగ'' సినిమా ఫస్ట్ షో చూసే వారికి సినిమా ఎంజాయ్‌మెంట్‌తో పాటు ఇటు బిర్యానీతో కడుపు కూడా నిండుతుంది. సో మనం కూడా ఈ సినిమా చూడాలంటే బెంగళూరుకు వెళ్లాల్సిందే. ఈ బిర్యానీ ఆఫర్ తో ఈ సినిమా ఫస్ట్ షో టిక్కెట్లకు మరింత డిమాండ్ పెరగనుంది. ఈ నెల 30న సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.