డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. తన తనయుడు ఆకాశ్ హీరోగా రూపొందించిన చిత్రం "మెహబూబా". 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథాంశంగా ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్‌కు .. టీజర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈనేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ ట్రైలర్ ద్వారా పూరి సింపుల్‌గా కథ చెప్పేశాడు. ఇది ఒక సైనికుడి ప్రేమకథగా, యుద్ధం.. ప్రేమకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. దేశాన్ని ప్రేమించే మనసు కేవలం ఒక్క సైనికుడికే ఉంటుంది. ఆ మనసులో చిన్న స్థానం దొరికినా చాలు. అసలు ఈ సరిహద్దులనేవి లేకుంటే ఎంత బాగుండేది. మమ్మల్ని చంపేస్తే మళ్లీ పుడతాం.. మళ్లీ మళ్లీ పుడతాం అంటూ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకునేలా వున్నాయి.