పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో నటించకూడదని డిసైడ్ అయ్యా : ఆకాష్ పూరి

డీవీ

సోమవారం, 11 మార్చి 2024 (13:24 IST)
Akash Puri
పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి. లవర్ బాయ్ గా సినిమాలు చేశాడు. యాక్షన్ కూడా చేసాడు. కానీ ఇంకా తనను చిన్న పిల్లాడు అంటున్నారని వాపోతున్నాడు. అందుకే సినిమాల గురించి ఓ నిర్ణయం తీసుకున్నానని చెపుతున్నారు.
 
కెరీర్ పరంగా చూస్తే గత సినిమా చోర్ బజార్ అంతగా ఆదరణ పొందలేదు. అందుకే ఈసారి నేను చేసే సినిమాను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలని అనుకుంటున్నాను. ఓ లవ్ స్టోరీ, మరో యాక్షన్ మూవీ కథలు విన్నాను. అవి ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాం. ప్రాజెక్ట్ లాక్ అయ్యాక మీకు వివరాలు చెబుతాను. నేను ఈసారి చేసే సినిమా కిడ్స్, ఫ్యామిలీ, యూత్ అందరికీ నచ్చేలా చూసుకుంటాను. నేను ఇప్పటికీ చిన్న పిల్లాడిలా ఉంటాను అనే కంప్లైంట్ ఉంది. హీరోగా సెట్ అయిన తర్వాతే విలన్ వంటి క్యారెక్టర్స్ చేయడం గురించి ఆలోచిస్తా. నాన్న పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఇప్పట్లో నటించకూడదు అని అనుకున్నా. నాకు నేనుగా హీరోగా పేరు తెచ్చుకున్న తర్వాతే నాన్న డైరెక్షన్ లో మూవీ చేస్తా. నాకు అమ్మా నాన్న ఇద్దరి సపోర్ట్ పూర్తిగా ఉంది. నా స్క్రిప్ట్స్ నాన్న చదువుతారు. 
 
మన ఇండస్ట్రీలో చాలా గొప్ప సినిమాలు వస్తున్నాయి. కార్తికేయ 2, హనుమాన్ వంటి మూవీస్ చూసినప్పుడు ఇలాంటి సినిమాల్లో నటించాలి అనే కోరిక కలుగుతుంటుంది. నాన్న పూరి డైరెక్షన్ లో రామ్ గారు నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ చాలా బాగా వస్తోంది. ఈ మధ్యే టీజర్ రఫ్ కట్ చూశాను. రామ్ గారి అభిమానులు హ్యాపీగా ఫీలయ్యేలా టీజర్ ఉంటుంది. ప్రభాస్ గారిని కలిసినప్పుడు ఎంతో ప్రేమగా మాట్లాడుతారు. ప్రస్తుతానికి నేను సింగిల్ గానే ఉన్నాను. ఏ అమ్మాయినీ ప్రేమించడం లేదు. అని ఆకాష్ పూరి అన్నారు.
 
లేటెస్ట్ గా - ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఆకాష్ పూరి ఉన్నారు  నన్ను రమేష్ , రోమన్  సంప్రదించారు. నేను ఈ బ్రాండింగ్ కు ప్రచారకర్తగా చేయడం కరెక్టేనా అని ఆలోచించాను. ఎందుకంటే నేను చాలా క్యాజువల్ డ్రెస్ లో బయటకు వెళ్తుంటాను. వీళ్లు అనేక రకాల మెన్స్ వేర్ బ్రాండ్స్ నాకు చూపించారు. అయితే క్లోతింగ్ రంగంలో వీళ్ల ప్లానింగ్, లక్ష్యం గురించి తెలుసుకున్న తర్వాత ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు ముందుకొచ్చాను. నేను చేస్తున్న ఫస్ట్ బ్రాండింగ్ ఇదే కావడం హ్యాపీగా ఉంది. నిన్న ఈ బ్రాండ్ ను లాంఛ్ చేస్తూ అనౌన్స్ మెంట్ ఇచ్చాం. ఆ ప్రకటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే కాకుండా మరికొన్ని బ్రాండింగ్స్ కు కూడా అంబాసిడర్ గా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి అని తెలిపారు. 
 
 
 
 
యంగ్ హీరో ఆకాష్ పూరి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. తొలిసారి ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్లాత్ బ్రాండింగ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్రేజీ మెన్స్ క్లాత్ బ్రాండింగ్ గా పేరు తెచ్చుకుంటోంది. ఈ క్లాతింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం హ్యాపీగా ఉందంటున్నారు ఆకాష్ పూరి. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన ఈ బ్రాండింగ్ లాంఛ్ కార్యక్రమంలో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ వ్యవస్థాపకులు రమేష్, రోమన్ తో కలిసి ఆకాష్ పూరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
 
 
 
 
ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ ఓనర్ రమేష్ మాట్లాడుతూ - ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ ను మొదట ఆన్ లైన్ బ్రాండింగ్ గా మొదలుపెట్టాం. ఆన్ లైన్ లో క్లోతింగ్ విషయంలో చాలా ఫ్రాడ్స్ జరుగుతుంటాయి. మనం జెన్యూన్ గా కస్టమర్స్ కు క్లోత్స్ అందించాలని ఆన్ లైన్ లో అమ్మకాలు ప్రారంభించాం. క్యాజువల్స్, ఫార్మల్స్, ఇంపోర్టెడ్, ఫంకీ, మెన్స్ యాక్ససరీస్ ఇలా...మెన్స్ క్లోతింగ్ కు వన్ స్టాప్ లా ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ ఉండాలని ప్లాన్ చేస్తున్నాం. ఆర్ సీకి వస్తే ఏ ప్రాడక్ట్ అయినా దొరుకుతుంది అనే నమ్మకాన్ని ఇస్తున్నాం. మా బ్రాండ్ కు అంబాసిడర్ గా ఎవరు బాగుంటారని అనుకున్నప్పుడు ఆకాష్ అయితే బాగుంటుంది అనిపించింది. ఆయనను అప్రోచ్ అయి మా బ్రాండ్ గురించి చెప్పాం. ఆకాష్ గారు మా బ్రాండ్ కు ప్రచార కర్తగా ఒప్పుకోవడం సంతోషంగా ఉంది. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.
 
ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ ఓనర్ రూమన్ మాట్లాడుతూ - మా ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ ను 2022లో స్టార్ట్ చేశాం. రెండేళ్లలోనే ఒక మంచి పొజిషన్ లోకి రావడం సంతోషంగా ఉంది. ఈ బ్రాండ్ మేము స్థాపించడం వెనక ఉన్న లక్ష్యం ఒక్కటే. మెన్స్ వేర్ కు వన్ స్టాప్ సొల్యూషన్ లా ఉండాలని అనుకున్నాం. మెన్స్ వేర్ లో మార్కెట్ లో ఉన్న స్పేస్ ను క్యాప్షర్ చేయాలని అనుకుంటున్నాం. మేము విజయవాడలో స్టోర్ పెట్టినప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చి కొనుక్కునేవాళ్లు. కొన్ని రోజుల్లోనే హైదరాబాద్ లో బ్రాంచ్ పెట్టబోతున్నాం. మా బ్రాండ్ కు ప్రచాకర్తగా చేసేందుకు ఒప్పుకున్న ఆకాష్ అన్నకు థ్యాంక్స్. అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు