ఇంటర్నేషనల్ డ్రైవింగ్ కోసం ఆర్టీవో కార్యాలయంలో బన్నీ

ఠాగూర్

బుధవారం, 20 మార్చి 2024 (17:41 IST)
టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం ఆయన ఆర్టీవో అధికారుల సమక్షంలో హాజరయ్యారు. కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఆర్టీవో అధికారులు సాదర స్వాగతం పలికారు. 
 
కాగా, ప్రస్తుతం అల్లు అర్జున్ "పుష్ప-2" చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. త్వరలోనే జపాన్ దేశంలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అక్కడ డ్రైవింగ్‌కు అవసరమైన లైసెన్స్ కోసం ఆయన దరఖాస్తు చేసుకుని ఈ లైసెన్స్‌ను తీసుకుని ఉంటారని భావిస్తున్నారు. 
 
కాగా, ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి బన్నీ వచ్చిన సమయంలో ఆయనను ప్రత్యక్షంగా చూసేందుకు ఆయన అభిమానులతో పాటు స్థానికులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. అలాగే, ఆర్టీవో కార్యాలయ సిబ్బంది కూడా అల్లు అర్జున్‌తో ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. కొత్తగా కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కారును టీజీ 09, 0666 అనే నంబరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఆర్టీవో అధికారులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు