మరోవైపు అనుష్క నటిస్తున్న థ్రిల్లర్ చిత్రానికి ప్రముఖ కథా రచయిత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మూవీ చిత్రీకరణ ఎక్కువ శాతం అమెరికాలో జరగనుంది. ఈ చిత్రంలో హాలీవుడ్ నటులు కూడా నటిస్తారని సమాచారం. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనుండగా, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది.