మెగా కాంపౌండ్‌లోకి కన్నడ భామ, 'గీతగోవిందం' హీరోయిన్ రష్మిక మందన్నా ప్రవేశించనుంది. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ - హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన "జిగర్తాండ" చిత్రాన్ని వరుణ్ తేజ్ హీరోగా రీమేక్ చేయనున్నారు.
ఇందులో రష్మిక మందన్నాను హీరోయిన్‌గా ఖరారు చేసినట్టు సమాచారం. 'గీతగోవిందం' చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన రష్మిక.. ఆ తర్వాత 'దేవదాస్' చిత్రంలో ప్రేక్షకులకు కనిపించింది. కానీ, ఈ చిత్రం ఆమెను పూర్తిగా నిరాశపరిచింది. ఇపుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తోంది.