హాలీవుడ్‌లోకి రాధికా ఆప్టే.. జేమ్స్ బాండ్ సినిమాలో ఛాన్స్?!

శుక్రవారం, 8 నవంబరు 2019 (14:38 IST)
బాలీవుడ్ హీరోయిన్లు హాలీవుడ్‌లోకి కాలుపెట్టడం కొత్తేమీకాదు. ఐశ్వర్యారాయ్, దీపికా పదుకునే, ప్రియాంక చోప్రాల తరహాలోనే రాధికా ఆప్టే కూడా హాలీవుడ్‌కు వెళ్లనుంది.

తెలుగులో బాలయ్య సరసన లెజెండ్, లయన్ లాంటి సినిమాలు చేసింది రాధిక.. బాలీవుడ్‌లో ధోనీ, రక్తచరిత్ర లాంటి సినిమాలు చేసినా గుర్తింపు రాలేదు. అంతేగాకుండా ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. తనను విమర్శించేవారికి సరైన సమాధానం చెప్పే రాధికా ఆప్టే.. తాజాగా మరో రెండు సంచలన సినిమాల్లో నటించబోతుంది. 
 
జేమ్స్‌ బాండ్‌ బ్రాండ్ నుంచి రాబోతున్న ఓ సీక్వెల్‌లో రాధిక పేరు వినిపిస్తుంది. ఇందులో ఓ హీరోయిన్‌గా ఈమె నటించబోతుంది. దాంతో పాటే స్టార్‌ వార్స్‌ సినిమాలో కూడా నటించబోతుంది రాధిక.

రాధికా ఇచ్చిన ఆడిషన్‌ నచ్చితే బాండ్‌ సినిమాతో పాటు స్టార్‌ వార్స్‌ సినిమాలోనూ ఈమె హీరోయిన్ కానుంది. ఇకపోతే.. ఈ మధ్యే ది వెడ్డింగ్ గెస్ట్ సినిమాలో కూడా నటించింది రాధిక. అందులో న్యూడ్ సీన్ కూడా చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు